అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా..!

post

లండన్ లో కూడా కరోనా వైరస్ తన పడగ విప్పుతోంది. తాజాగా, అప్పుడే పుట్టిన ఓ పిల్లాడి కి కరోనా వైరస్ ఉందని తేలడం తో డాక్టర్లు అవాక్కయ్యారు. తల్లి గర్భవతి గా ఉన్నపుడే కరోనా సోకిందా, లేక తరువాత సోకిందా అనేది తెలియరాలేదు. డెలివరీ అయిన తరువాత, తల్లి కి కరోనా పరీక్షలు చేయగా, పాజిటివ్ అని తేలడం తో బిడ్డకు కూడా పరీక్ష చేసారు. బిడ్డ కు కూడా కరోనా పాజిటివ్ అని వచ్చింది. దానితో, వైద్యులు ప్రస్తుతానికి తల్లి బిడ్డలను వేరు వేరు గా ఉంచి చికిత్స అందిస్తున్నారు. బిడ్డకు కరోనా తల్లి కడుపులో ఉండగానే వచ్చిందా లేక పుట్టిన తర్వాత వచ్చిందా అనే విషయం తెలుసుకోవడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బిడ్డని అదే ఆసుపత్రి లో ఉంచారు. తల్లిని మాత్రం ఇన్‌ఫెక్షన్ స్పెషాలిటీ హాస్పిటల్‌ కు మార్చి చికిత్సను అందిస్తున్నారు.

    చైనా లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కాకపోతే, అక్కడి బిడ్డ కు కరోనా వైరస్ సోకలేదు. ప్రస్తుతం, లండన్ లో దాదాపు 136 మంది కరోనా వైరస్ ద్వారా చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ 114 దేశాలలో 1,40,000 మందికి సోకింది. దీనితో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా ను ప్రపంచ మహమ్మారి గా ప్రకటించింది. నేటికీ ఐదువేల మంది వరకు కరోనా వైరస్ వల్ల మృత్యువాత పడ్డారు. దాదాపు మూడువేల మంది చైనా కు చెందిన వారు అవడం గమనార్హం. యూరప్ కంట్రీస్ లో ఎక్కువ గా వ్యాప్తి అవుతుండడం తో, అమెరికా బ్రిటన్ నుంచి వచ్చే వారికీ నిషేధం విధించింది.