ఇకపై రైల్వే టిక్కెట్ల కు ఏజంట్లు వుండరు...!

post

రైలు ప్రయాణికులు  ఇకపై తమ టికెట్ల కోసం ప్రైవేట్‌ విక్రేతలు, ఏజెంట్లపై ఆధారపడే అవసరం ఇకపై ఉండదని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్ల సాయంతో
ప్రయాణికులే స్వయంగా టికెట్లను బుక్‌ చేసుకుంటున్నందున ఇకపై ఏజెంట్ల అవసరం లేకుండా చేస్తామన్నారు. సొంతంగా బుక్‌ చేసుకోలేని వారు ప్రభుత్వ కామన్‌ సర్వీస్‌ సెంటర్లకు
వెళ్లవచ్చని తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో రైల్వే శాఖ గ్రాంట్ల డిమాండ్‌పై చర్చ సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన కొద్ది
నిమిషాల్లోనే అక్రమమార్గాల్లో బుక్‌ చేసుకునే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. . రైల్వేల్లోకి ప్రైవేట్‌ భాగస్వామ్యంతో వచ్చే 12 ఏళ్లలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులను
సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. 

 రైల్వేలో 2.87 లక్షల ఉద్యోగాలు ఖాళీ..!
రైల్వేలో 15 లక్షల ఉద్యోగాలు వుండగా వాటిలో 2.87 లక్షల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని రైల్వే మంత్రి పీయూష్ గోయల్  తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు రాతపూర్వక
సమాధానమిచ్చిన మంత్రి  గ్రూప్ సి కేటగిరీలో 1.41 లక్షల ఉద్యోగాల భర్తీకి 2018లో మూడు నోటిఫికేషన్లు ఇచ్చామని  వాటికి సంబంధించి నియామక ప్రక్రియ పూర్తయిందన్నారు.
2019లో 1.43 లక్షల పోస్టుల భర్తీకి నాలుగు నోటిఫికేన్లు ఇచ్చామని తెలిపారు. డివిజన్ పరిధిలో అవసరమైన మేరకు కాంట్రాక్ట్ పద్దతిలో కార్మికులను నియమించుకుంటున్నట్లు
తెలిపారు.