జనసేన ఆవిర్భావ దినోత్సవం..!

post

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని స్థాపించి అపుడే ఆరేళ్ళు గడిచింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్చి 14, 2014న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టుగా ప్రకటన చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనం గా జరుపుకోవాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అభిమానులు భావించారు. కానీ,  స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిబంధనల వల్ల బహిరంగ సభలకు బదులుగా ఏమైనా ఇతర కార్యక్రమాలను నిర్వహించాలని జనసేన పార్టీ భావిస్తోంది.

      జనసేన 2014లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే, 2014 లో టీడీపీ అధికారం లోకి రావడానికి ఓ రకం గా జనసేనానే కారణమని చాల మంది ప్రజల్లో నాటుకుపోయింది. ఏపీలో టీడీపీకి జనసేనకు మధ్య అంతర్గత ఒప్పందo ఉందని చాలామంది ప్రజలు ఇప్పటికీ విశ్వసిస్తున్నారు. అయినా, టీడీపీ పార్టీ తో తనకు ఎలాంటి పొత్తు లేదని, ఒకసారి నమ్మి మోసపోయానని, ఇంకోసారి ఇలా జరగదని ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాల సార్లు స్పష్టం చేసారు. ఎన్నికల్లో పార్టీ గెలిచినా, గెలవకపోయినా, పార్టీ తరపున ప్రజలకోసం పోరాడుతూనే ఉంటామని, జనం కోసమే జనసైనికులు పని చేస్తారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాల సార్లు చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు ప్రజలపక్షం కోసమే ఆయన పని చేసారు. 2019  ఎన్నికలలో, కారణాలు ఏమైనా, ఆయన ఎన్నికలలో చోటు దక్కించుకోలేకపోయారు. అయిన, తన పోరాటాన్ని ఆపలేదు. ఎన్నికలలో ఓడిపోవడం తో, ప్రస్తుతం పార్టీ పరిస్థితి కష్టతరం గా మారింది. పార్టీ కోసం ఆయన తిరిగి సినిమాల్లోకి వచ్చి ఆయన్ను నమ్ముకున్న వారిని ఇబ్బందులకు గురి చేయకుండా చూస్తున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల కోసం మళ్ళీ సిద్ధమై పోరాడుతున్నారు. బీజేపీ తో పొత్తు పెట్టుకుని, స్థానిక ఎన్నికలలో కలిసి పోరాడతామని ప్రకటించిన సంగతి విదితమే.

మన నుడి - మన నది..!

జనసేన పార్టీ ఆవిర్భావం రోజున, వారు ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించ సంకల్పించారు. 'మన నుడి - మన నది' కార్యక్రమాన్ని రాజమండ్రి నుంచి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈరోజు ఉదయం పార్టీ నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్  సాయంత్రం 4 గంటలకు ధవళేశ్వరంలోని శ్రీరామపాదాల రేవులో గోదావరి నదికి హారతి ఇచ్చి ‘మన నుడి – మన నది’ కార్యక్రమం చేపట్టనున్నారు. తిరిగి పదిహేనవ తేదీన సామాజిక వేత్తలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు.