4 వేల కోళ్లను చంపేయనున్న కేరళ..!

post

ఓ వైపు కరోనా మరోవైపు బర్డ్ ఫ్లూ కేసులతో కేరళ సతమతమవుతోంది. ఇదివరకే కేరళలో మొదటి కరోనా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే, కేరళ ప్రభుత్వం కరోనా కేసును సమర్ధవంతం గా తిప్పికొట్టింది. కాగా, ఈ వైరస్ ను మరింత వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపధ్యం లో అక్కడి కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాధి సోకి పరిస్థితి మరింత తీవ్రం అవుతోంది. దీనితో, కేరళ ప్రభుత్వ అధికారులు అప్రమత్తమై వైరస్ సోకిన కోళ్లను చంపేయాలని అధికారిక ప్రకటన చేశారు. ఒకటి, రెండు కాదు ఏకం గా నాలుగువేల కోళ్లను ప్రభావిత ప్రాంతానికి కిలోమీటర్ దూరం మేర తీసుకువెళ్లి అక్కడ చంపేయాలని తెలిపారు.

          కోజికోడ్, మలప్పురం ప్రాంతాల్లో కోళ్లకు ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా సోకినట్లు కేరళ పశుసంవర్దక శాఖ మంత్రి కే.రాజు తెలిపారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను గుర్తించడానికి ప్రత్యేకం గా బృందాలను ఏర్పాటు చేసారు. తాజాగా, పరప్పనంగడి ప్రాంతంలో 4 వేల కోళ్లను చంపేస్తున్నారు.