యెస్ బ్యాంక్ కు గుడ్ న్యూస్.. నిషేధం ఎత్తివేత..!

post

ఇటీవల ఎస్ బ్యాంకు సంక్షోభం లో కూరుకుపోవడం తో ఆ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. దీనితో ఆ బ్యాంకు ఖాతాదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. యాభై వేల కన్నా ఎక్కువ విత్ డ్రా చేయరాదన్న నిబంధన విధించడం తో, ఖాతాదారులంతా ఒక్కసారిగా బ్యాంకు కు క్యూ కట్టారు. ఎటిఎం ల వద్ద డబ్బులు తీసేసుకోవడానికి ప్రయత్నించారు. మార్చి ఐదవ తేదీనుంచి దాదాపు నెల రోజులపాటు ఈ నిషేధం ఉండొచ్చని అపుడు ఆర్బీఐ తెలిపింది.

            తాజాగా, ఈ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ చెప్పింది. యెస్ బ్యాంక్ లిమిటెడ్ పునర్నిర్మాణ పథకం 2020 ఈరోజు నుంచే అమలు కానుంది. ఈ పధకం అమలు అయిన మూడవ రోజు నుంచి నిషేధం ఎత్తివేయబడుతుంది. అంటే, మార్చి పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలనుంచి ఈ నిషేధం ఎత్తివేయబడుతుంది. ఈ మేరకు మినిస్ట్రీ అఫ్ ఫైనాన్స్ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. 

https://twitter.com/FinMinIndia/status/1238653382115487744