ప్రకాష్ రాజ్ కు కోర్టు సమన్లు..!

post

ప్రఖ్యాత సినీ నటుడు ప్రకాష్ రాజ్ కు చెక్ బౌన్స్ కేసు లో కోర్టు సమన్లు పంపింది. ఆయన నిర్మించిన న‌డిగ‌ర్ అనే తమిళ సినిమా కోసం ఓ బాలీవుడ్‌ ఫైనాన్సియర్‌ వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఇటీవల ఆయనకు ప్రకాశ్‌ రాజ్‌ చెక్ ఇచ్చారు.

అయితే, ఆ ఫైనాన్సియర్‌ ఆ చెక్‌ను బ్యాంక్‌లో వేయగా బౌన్స్ అవడంతో ఆయన మ‌ద్రాస్ హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. దీంతో ప్రకాశ్‌రాజ్‌కి న్యాయ‌మూర్తి స‌మ‌న్లు జారీ చేసి, ఈ కేసులో ఏప్రిల్‌ 2వ తేదీలోగా కోర్టుకు హాజరవ్వాలని ఆదేశించారు.నటుడు ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళ్ లతో పాటు ఇతర భాషా చిత్రాల్లోనూ నటించి పేరు ప్రఖ్యాతలు గడించారు. విలన్ గా పలు చిత్రాల్లో ఆయన ఆకట్టుకున్నారు.