హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్..!

post

కరోనా వైరస్ కోరలు చాచి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ వైరస్ ను అగ్రజార్యం అమెరికానూ వదల్లేదు. స్వతహాగానే అమెరికా వాసులు ఎంతో శుచి, శుభ్రతలను పాటిస్తారు. అయినా సరే, విదేశాల నుంచి వచ్చే వారి కారణంతో ఓ వైరస్ కేసు నమోదు కావడం తో, అధికారులు అప్రమత్తమై కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి అన్నిరకాల ఏర్పాట్లు తీసుకున్నారు. అయినా ఈ వైరస్ వ్యాప్తి జరిగి కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతుండడం తో, తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెల్త్ ఎమర్జెన్సీ ని ప్రకటించారు. వైరస్ వ్యాప్తిని నివారించడం కోసం ఐదు వేల కోట్ల డాలర్ల నిధులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గతం లో ఓసారి, ట్రంప్ బహిరంగ సమావేశాల్లో పాల్గొన్న సమయాల్లో కరోనా పరీక్షలు చేయించుకోవాలని అనుకోవడం లేదని, అంత అవసరం లేదని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా,  ప్రస్తుతం ఆయన కూడా పరీక్ష చేయించుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

         ఇటీవల, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సోనారో ను మరియు అతని కమ్యూనికేషన్ చీఫ్ ఫాబియోను కలిశారు. దాదాపు రెండు గంటల పాటు వారితో సమావేశమై, తరువాత వారితో కలిసి లంచ్ చేసారు. ఫాబియో కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా, బోల్సోనారోకు సోకలేదని పరీక్ష లో తేలింది. ఈ విషయం ట్రంప్ తెలిపారు. పక్క పక్కనే కలిసి భోజనం చేశామని, అయితే, బొల్సోనారో కు మాత్రం కరోనా సోకలేదని ఆయన తెలిపారు.