బిల్ గేట్స్ రాజీనామా..!

post

మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ లో తన పదవికి రాజీనామా చేశారు. సంస్థ డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వారెన్ బఫెట్ కంపెనీ నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. ఈ విషయాన్ని సంస్థ శుక్రవారం ప్రకటించింది. తన సమయాన్ని గ్లోబల్ హెల్త్, విద్య వంటి సామాజిక సేవలకు వినియోగించే ఉద్దేశంతో ఆయన మైక్రోసాఫ్ట్ నుంచి తప్పుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.  బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు సాంకేతిక సలహాదారుగా కొనసాగనున్నారు. 1975లో పాల్ అలెన్ తో కలిసి మైక్రోసాఫ్ట్ సంస్థను బిల్ గేట్స్ స్థాపించారు.  .2000 సంవత్సరం వరకు కంపెనీ సీఈవోగా కొనసాగిన బిల్ గేట్స్  2008 లో పూర్తి స్దాయి విధులనుంచి తప్పుకుని . 2014లో  మైక్రోసాఫ్ట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.  బిల్ గేట్స్ తప్పుకోవడంతో మైక్రో సాఫ్ట్ బోర్డులో 12 మంది ఉంటారు. బిల్ గేట్స్ తో కలిసిపనిచేయడం గొప్ప గౌరవమని సత్యనాదెళ్ల తెలిపారు. ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు తెలిపారు. . బిల్ గేట్స్ నాయకత్వం, విజన్ తో బోర్డు చాలా లాభపడిందని చెప్పారు. బిల్ గేట్స్ టెక్నికల్ పాషన్ సంస్థకు ఉపయోగపడుతుందన్నారు. 
మైక్రోసాఫ్ట్‌, బెర్క్‌షైర్‌ హాత్‌వే పబ్లిక్‌ బోర్డుల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రజారోగ్యం, అభివృద్ధి, విద్య, పర్యావరణ మార్పులపై పోరాడటం వంటి దాతృత్వ కార్యక్రమాలకు మరింత సమయం కేటాయించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. బెర్క్‌షైర్‌ కంపెనీలు కానీ, మైక్రోసాఫ్ట్‌ కానీ ఎప్పుడూ లేనంత పటిష్ఠంగా ఉన్నాయి. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయం అని గేట్స్‌ పేర్కొన్నారు.