విదేశీయుల ప్రవేశంపై నిషేధం లేదు..!

post

కరోనా (కొవిడ్-19) వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్‌లోకి విదేశీ ప్రయాణికుల ప్రవేశంపై  అనధికారిక నిషేధం ఏమైనా వుందా?  అంటే లేదనే అంటున్నారు  కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్‌. జైశంకర్. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆర్‌ఎస్‌పీ సభ్యుడు ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్‌, భారత్‌ మాత్రమే పూర్తి స్థాయిలో నిషేధం విధించిన దేశం అన్న వ్యాఖ్యలకు మంత్రి స్పందించారు. ఈ సందర్డంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.  కొన్ని దేశాల నుంచి భారత్‌కు వచ్చే విదేశీయులు క్వారంటైన్‌కు వెళ్లవలసి ఉంటుంది. అయితే,  ఇది కొన్ని సార్లు కచ్చితంగా, ఇంకొన్ని సార్లు ప్రయాణికుల ఇష్టం మేరకు ఉంటుంది. స్వదేశానికి తిరిగి వచ్చే భారతీయులు మాత్రం క్వారంటైన్‌కి రావాలి అని తెలిపారు. ఇటలీ, ఇరాక్‌లో చిక్కుకొన్న భారతీయులకు పరీక్షల్లో కరోనా నెగటివ్‌ అని తేలితేనే వారిని స్వదేశానికి తీసుకువస్తామని భూటాన్‌, మాల్దీవులు, ఇరాన్‌ నుంచి కూడా మాస్కుల కోసం వినతులు వచ్చాయని, వారికి సహాయం చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని  కేంద్ర విదేశాంగశాఖ తెలిపింది