ఖాళీ స్టేడియాలు.. రాని విదేశీ ఆటగాళ్లు

post

ఐపీఎల్‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తారని అందరూ భావించారు.బీసీసీఐ నష్టాన్ని భర్తీ చేస్తుంది కాబట్టి  ఫ్రాంచైజీలు సైతం అందుకు అంగీకరిస్తాయని ఊహాగానాలు.. అయితే చివరకు .ప్రజా సంక్షేమం, సురక్షితమైన క్రికెట్‌ ఈ రెండింటి కోసం ఐపీఎల్ ను వాయిదా వేసారు. . కరోనా ఎఫెక్టుతో  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 సీజన్‌ వాయిదా పడింది. ఏప్రిల్‌ 15 నుంచి లీగ్‌ను ఆరంభిస్తామని బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే ఈ సమాచారాన్ని అన్ని ఫ్రాంచైజీలకు చేరవేసినట్టు సమాచారం. షెడ్యూలు ప్రకారం మార్చి 29 నుంచి లీగ్‌ ఆరంభం కావాల్సి ఉంది.
      భారీగా జనాలు గుమిగూడటాన్ని అడ్డుకోవాలని బీసీసీఐ సహా దేశంలోని అన్ని క్రీడా సమాఖ్యలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేయడం,  రద్దు చేయడానికి వీలు కాకపోతే  ఖాళీ స్టేడియాల్లో నిర్వహించుకోవాలని చెప్పడం ఇవన్నీ బీసీసీఐను ఆలోచనలో పడేసాయి. దీనికి తోడు విదేశీ ఆటగాళ్లు లేకుండా టోర్నీ ఎలా అంటూ ఫ్రాంచైజీల సందేహాలు.దీనితో ఐపీఎల్ ను వాయిదా వేయడమే మంచిదని బీసీసీఐ నిర్ణయించింది.