ఫరూక్ అబ్దుల్లా విడుదల..!

post

పబ్డిక్ పెక్యూరిటీ యాక్ట్ (పీఎస్ ఏ) కింద అరెస్టయిన నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత ఫారూక్ అబ్దుల్లా ఏడు నెల‌ల గృహ నిర్బంధం త‌ర్వాత నేడు రిలీజ్ అయ్యారు.  కశ్మీర్ లో గత ఆగష్టు నెలలో ఆర్డికల్ 370 ను రద్దు చేసిన తరువాత జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం లు ఫారూక్ అబ్దుల్లా ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతో పాటు పలువురు ఇతర నాయకులను అరెస్ట్ చేసారు. నిర్బందం నుంచి విడుదల అయిన తరువాత ఫరూక్ మీడియా తో మాట్లాడుతూ ప్ర‌స్తుతం  తాను స్వేచ్ఛా జీవిన‌య్యానని   త్వ‌ర‌లోనే ఢిల్లీకి వెళ్ల‌ి.  పార్ల‌మెంట్‌లో మాట్లాడ‌నున్నాని, ప్ర‌తి ఒక్క‌రి కోసం త‌న గ‌ళాన్ని వినిపిస్తానని  చెప్పారు.   ప్ర‌తి ఒక్క‌ర్నీ విడుద‌ల చేసే వ‌ర‌కు ఎటువంటి రాజ‌కీయ అంశాల‌పై మాట్లాడ‌ను అని ఆయ‌న అన్నారు. త‌మ స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన రాష్ట్ర ప్ర‌జ‌లు, నేత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌తి ఒక నేత రిలీజైన‌ప్పుడే ఈ స్వేచ్ఛ‌కు అర్థం ఉంటుంద‌న్నారు.