ఐపీఎల్ వాయిదా..!

post

ఐపీఎల్ పై పలు చర్చలు నడుస్తున్న నేపధ్యం లో ఐపీఎల్ ను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ పడగ విప్పి కూచున్న వేల జన సమ్మేళనాలు సాధ్యం కాదని తెలిపింది. ఈ తరుణం లో ఐపీఎల్ జరపడం సాధ్యం కాదని, కరోనా వైరస్ వ్యాప్తి కి అడ్డుకట్ట వేయలేమని భావించింది. అందుకే ఐపీఎల్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అత్యంత ప్రజాదరణ కలిగిన ఐపీఎల్ టోర్నీ ని ఏప్రిల్ పదిహేనవ తేదీ కి వాయిదా వేశారు. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. మ్యాచ్ లు పెడదామనే ఆలోచనలో ఉన్నప్పటికీ, మరోవైపు నిర్వాహకులు కూడా చివరిదాకా చూద్దాం అనే ధోరణిలో ఉన్నా, కేంద్రం సూచనలతో పాటు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులతో  బీసీసీఐ అధికారులు వాయిదా నిర్ణయం తీసుకున్నారు.

    ఇప్పటికే, విదేశాల వారికి వీసా లు రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనితో, పలు దేశాల క్రికెటర్లకు భారత్ కు రావడానికి వీలే లేకుండా పోయింది. ఇక అందుకే బీసీసీఐ ఎలాగైనా టోర్నీని నడపాలన్న ప్రయత్నాన్ని విరమించుకుని, ప్రస్తుతానికి వాయిదా తో సరిపెట్టింది. ఏప్రిల్ పదిహేను నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి.