ఐస్ క్రీం తీసుకోలేదని...కాల్చేశారు..!

post

ఐస్ క్రీం ఫ్రీ గా ఆఫర్ చేసినా తీసుకోలేదన్న కారణం తో తుపాకీ తో కాల్చి చంపేసిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న లక్ష్య తన స్నేహితులైన కరణ్, ధీరజ్, అవినాష్ లు కలిసి ఇంట్లో పార్టీ చేసుకున్నారు. ఆ తరువాత, ఐస్ క్రీం తిందాం అని బయట ఓ షాప్ కి వచ్చారు. అదే సమయం లో అక్కడ శర్మ(బాధితుడు) అనే వ్యక్తి తో పాటు గా, అతని స్నేహితులు రాహుల్ , ఇషాంత్ లు ఉన్నారు. వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయం లో మద్యం మత్తులో ఉన్న లక్ష్య మరియు అతని స్నేహితులు కలిసి శర్మ బృందానికి ఐస్ క్రీం ను ఆఫర్ చేసారు. కానీ, వారు ఐస్ క్రీం ను వద్దని తిరస్కరించారు. ఈ నేపధ్యం లో చిన్న గొడవ ఐంది. తరువాత లక్ష్య తన స్నేహితులను ఇంటికి తీసుకువచ్చాడు. కానీ, అతని స్నేహితులకు ఫ్రీ గా ఐస్ క్రీం ఇస్తే శర్మ తీసుకోలేదన్న అహం తో ఉన్నారు. దానికి తోడు మద్యం మత్తులో ఉండడం తో అక్కడే వున్న శర్మ పై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కాల్పుల్లో శర్మ మృతి చెందాడు. శర్మ మృతి పై అతని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. సీసీ పుటేజీ లో బైక్ నెంబర్ల ఆధారంగా పోలీసులు ఆ నిందితుల్ని గుర్తించారు.