అసదుద్దీన్‌పై కేసు నమోదు..!

post

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీపై పాతబస్తీ మొగల్‌పుర పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. .. ఇటీవల కర్ణాటకలో ఎన్నార్సీ, సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్‌ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇక్విలాబ్‌ మిలత్‌ పార్టీ నేత బల కిషన్‌రావు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అసదుద్దీన్‌తోపాటు ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే వారిస్‌ పఠాన్‌ కేసు నమోదు చేయాలని పోలీసులు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు అసదుద్దీన్‌పై 153, 153(ఏ), 117, 295(ఏ), 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు మొగల్‌పుర పోలీసులు వెల్లడించారు.