కరోనా తో కుదేలయిన పర్యాటకం..!

post

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ ప్రభావం మన దేశంలో్ని అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా పర్యాటక రంగం అయితే కుదేలయిందనే చెప్పవచ్చు. మన దేశం నుంచి విదేశాలకు, విదేశాల నుంచి మన దేశానికి పర్యాటకుల సంఖ్య తగ్గిపోవడంతో విమానయాన సంస్దులు సిబ్బందిని సెలవుపై పంపిస్తున్నాయి. దేశంలో కూడ పరిస్దితి భిన్నంగా లేదు.   .ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల నుంచి రాకపోకలు గణనీయం గా తగ్గిపోయాయి. టికెట్లు బుక్‌ చేసుకున్న కస్టమర్లు కూడా ఆఖరి నిమిషంలో రద్దు చేసుకుంటున్నారని ఎయిర్‌లైన్స్‌ చెబుతున్నాయి.. ఇదే పరిస్దితి కొనసాగితే విమానయాన సంస్దలు కుప్పకూలినా ఆశ్చర్యం లేదని అంటున్నారు 
ప్రభుత్వం నెలరోజుల పాటు వీసాలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం వలన ట్రావెల్, టూరిజం, హోటల్ రంగాలకు .కు గడ్డుకాలమే. వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆదారపడిన వారితో కలిపితే మొత్తంమీద దేశీయ ఆర్దికవ్యవస్ద రూ. 8,500 కోట్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వీసాలపై నెల రోజుల నిషేధాన్ని పది రోజుల తర్వాతైనా  సమీక్షించి  కొన్ని నగరాల నుంచైనా భారత్‌కి ప్రయాణాలను అనుమతించాలని   ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ టూర్‌ ఆపరేటర్స్‌ (ఏఐటీవో), అసోచాం వర్గాలు కేంద్రానికి విజ్జప్తి చేసాయి.