ఐబీఎం సీఈఓ గా భారతీయుడు…!

post

ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, వంటి వాటిల్లో భారతీయులే చైర్మన్ గా ఉంది దేశానికీ ప్రతిష్ట తెచ్చారు. వీరి బాటలోనే మరో భారతీయుడు అరవింద్ కృష్ణ మరో దిగ్గజ ఐటీ కంపెనీ ఐబీఎం కు నూతన సీఈఓ గా ఎన్నుకోబడ్డారు. ఈయన ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. ఈ కంపెనీ కి చైర్మన్, ప్రెసిడెంట్, సీఈఓ గా గిన్నీ రొమెట్టి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇకనుంచి ఆమె ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కొనసాగనున్నారు. ఏడాది చివరిలో పదవి విరమణ చేయనున్నారు. ఈనేపథ్యం లో ఈమె మాట్లాడుతూ ఐబీఎం కు అరవింద్ అసలైన సారధి. కంపెనీకి సంబంధించి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్‌చైన్ వంటి కీలక టెక్నాలజీల అభివృద్ధిలో ఆయన చేసిన కృషి మరవలేనిది. కంపెనీ భవిష్యత్ బిసినెస్ లక్ష్యాలను ఆయన చేరుకోగలరని భావిస్తున్నాను అన్నారు. ఏప్రిల్ నెల నుంచి ఆయన చైర్మన్ పదవి బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ బోర్డు మెంబర్లు, గిన్నీ రొమెట్టి తన పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.