వైసీపీ లోకి...టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం..?

post

వరుస వలసలతో టీడీపీ కోలుకోలేకపోతోంది. అంతలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కి మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పార్టీ లో కీలకమైన సీనియర్ నేతలు కూడా పలు కారణాలతో పార్టీ ని వీడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, విశాఖ జిల్లా మాజీ ఎమ్మెల్యే రెహమాన్, కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ ఇంఛార్జ్ రామసుబ్బారెడ్డిలు టీడీపీ ని వదిలి జగన్ సమక్షం లోనే వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ సతీష్‌రెడ్డి కూడా పార్టీ కి, పదవి కి రాజీనామా చేసారు చెప్పారు. పంచకర్ల రమేష్ బాబు కూడా పార్టీ కి రాజీనామా చేసి వ్యాపారం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. కానీ, ఆయన కూడా వైసీపీ లోకి చేరతారని విస్తృతం గా ప్రచారం జరుగుతోంది.

        ఇది ఇలా ఉంటె, చంద్రబాబు కు అత్యంత సన్నిహితుడు, పార్టీ లో కీలకమైన వ్యక్తి కరణం బలరాం కూడా పార్టీ వీడుతున్నట్లు చెప్పారు. త్వరలోనే ఆయన సీఎం జగన్దీ మోహన్ రెడ్డి ని కలవనున్నట్లు సమాచారం. దీనితో టీడీపీ కి భారీ దెబ్బ తగిలినట్లే.

ఎన్టీఆర్ హయాం లో వచ్చిన బలరాం..!

గతం లో కాంగ్రెస్ పార్టీ లో కొనసాగిన కరణం బలరాం ఎన్టీఆర్ పిలుపుతో తెలుగుదేశం పార్టీ లోకి వచ్చారు. అప్పటినుంచి పార్టీ కోసం కష్టపడ్డారు. విస్తృతమైన సేవలు చేసారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆమంచికృష్ణమోహన్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు నిజానికి, చీరాల ఆయన సొంత నియోజక వర్గం కాదు. ఆయన అద్దంకి నుంచి పోటీ చేయాల్సి ఉంది. చంద్రబాబు ఆదేశం తోనే ఆయన చీరాల నుంచి పోటీ చేసినట్లు తెలుస్తోంది. ఒకసారి ఆయన టీడీపీ కి, చీరాల లోని పదవికి రాజీనామా చేస్తే చీరాల రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. అంతే కాదు, బలరాం సొంత నియోజక వర్గం అయినా అద్దంకి లో కూడా ఆయన రాజీనామా ప్రభావం ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

చీరాలలో మూడు వర్గాలు..!

ఒకవేళ కరణం బలరాం వైసీపీ లోకి చేరితే, చీరాల మూడు వైసీపీ వర్గాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే చీరాల లో  ఆమంచి కృష్ణమోహన్ వర్గం, పోతుల సునీతా (టీడీపీ నుంచే వైసీపీ లోకి వచ్చారు) వర్గం కొనసాగుతున్నాయి. బలరాం కూడా వైసీపీ గూటికి చేరితే, మరో వైసీపీ వర్గం చీరాల లో ఏర్పడుతుంది. ఈ ముగ్గురి నేతలను జగన్ ఎలా డీల్ చేస్తారో వేచి చూడాలి.