బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై వైసీపీ కార్యకర్తల దాడి..!

post

గుంటూరు జిల్లా మాచర్లలో వైసిపి కార్యకర్తలు టీడీపీ నేతలైన బోండా ఉమా, బుద్ధా వెంకన్నలపై దాడి కి దిగారు. వారు వస్తున్నారన్న సమాచారం ముందు గా తెలుసుకుని ఈ దాడి కి దిగినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యం లో ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నారు. వాస్తవానికి, టీడీపీ అభ్యర్థులను వైసీపీ నామినేషన్ వేయకుండా అడ్డుకుంటోంది. ఈ విషయాలను వాకబు చేయడం కోసం వారు మాచర్లకు వచ్చారు.  ఈ నేపధ్యం లో వైసీపీ కార్యకర్తలు బోండా ఉమా, బుద్ధా వెంకన్నలపై దాడి కి దిగడం చర్చనీయాంశం గా మారింది. ఓ వ్యక్తి కారు అద్దాలపై ఓ లావుపాటి కర్ర తో దాడి చేసాడు. డ్రైవర్ కార్ ను ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. అయినా సరే, అతను కర్రతో వెంబడించి దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో టీడీపీ నేతలకు గాయాలయ్యాయి. వారి శరీరం నుంచి రక్త స్రావం అయ్యింది.

          ఘటన జరిగిన తరువాత, చంద్రబాబు నాయుడు మీడియా సమక్షం లో బోండా ఉమా తో ఫోన్ లో మాట్లాడారు. నేతలపైనే కాకుండా, న్యాయవాది కిశోర్ పై కూడా దాడి జరిగినట్లు బోండా ఉమా తెలిపారు. వారికి రక్షణ కల్పించడానికి వచ్చినా డీఎస్పీ వాహనం పై కూడా దాడి చేసినట్లు ఆయన చెప్పారు. పోలీసుల వాహనం లోనే తాము అక్కడినుంచి బయటపడ్డామని, తప్పించుకుని మార్కాపురం వైపునకు వెళ్లామని, అక్కడకి కూడా వైసీపీ కార్యకర్తలు వెంబడించి దాడి చేయడానికి ప్రయత్నించారని టీడీపీ నేత బోండా ఉమా చెప్పుకొచ్చారు. ఆయన ఫోన్ లో తెలిపిన సమాచారాన్ని చంద్రబాబు మీడియా కు తెలిపారు.

      టీడీపీ నేతలతో ఉన్న న్యాయవాది కిషోర్ కు తలపై తీవ్ర గాయాలయ్యాయి. ఆయన చొక్కా మొత్తం రక్తం తో తడిసిపోయింది. డ్రైవర్ అప్రమత్తం గా వ్యవహరించి కారు ను మళ్లించడం తో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై టీడీపీ నేతలు తీవ్ర నిరసనలు తెలియచేస్తున్నారు. ఈ ఘటనపై, చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. రాష్ట్రము లో మనుషులు బతకడానికి వీలులేదా...? మనుషుల్ని చంపేస్తూ రాజకీయాలు చేస్తారా..? బోండా ఉమా, బుద్ధా వెంకన్నలు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు..? అంటూ వైసిపి పై మండిపడ్డారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి దాడి చూడలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో  అసలు స్వేచ్ఛ లేదా? అని ప్రశ్నించారు.మాచర్లలో జరిగిన దాడిపై డీజీపీ సమాధానం చెప్పాలి. ఇంత జరుగుతున్నా ఆయనకు కనీసం చీమకుట్టినట్లయినా లేదు. మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా? నామినేషన్లు వేయకుండా ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఓడిపోతామని భయమా..?

టీడీపీ నేతలపై జరిగిన దాడిపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఘాటు గా స్పందించారు. ఓడిపోతామన్న భయం తోనే, టీడీపీ ఇలాంటి పనులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేలాగా వైసీపీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థలు సజావుగా జరగాలంటే, ఈ విషయం లో రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు.