విజయవాడ కార్పొరేషన్ మేయర్ గా కేశినేని శ్వేత..!

post

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని రెండవ కుమార్తె కేశినేని శ్వేత ప్రత్యక్షం గా రాజకీయాల్లోకి వచ్చారు. గత ఏడాది ఎన్నికల్లో ఆమె తన తండ్రి కేశినేని నాని కోసం విశేషం గా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కాగా, చంద్రబాబు నాయుడు ఆమెను ప్రత్యక్షం గా రాజకీయాల్లోకి దింపినట్లు తెలుస్తోంది. విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిగా శ్వేతను రాజకీయాల్లోకి దింపారు. ఈ మేరకు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారిక ప్రకటన చేసారు.

         కాగా, కేశినేని శ్వేతా గత రెండు లోక్ సభ ఎన్నికల లోను విస్తృతం గా ప్రచారం చేసారు. అంతే కాకుండా, గత ఏడాది అమెరికా ఎన్నికల్లో కూడా, హిల్లరీ క్లింటన్ తరపున కూడా ఆమె ప్రచారం చేసారు. హిల్లరీ క్లింటన్ గెలవాలని కేశినేని శ్వేతా తీవ్రం గా శ్రమించారు.