ఏపీ ని ఆదుకోండి..మోడీ తో జగన్...!

post

కరోనా మహమ్మారి భారత్ పై కూడా పంజా విసిరింది. మొదట్లో తక్కువ గానే ఉన్న కేసులు ఉన్నట్లుండి విజృంభించాయి. దీనితో ప్రభుత్వాలు మరిన్ని చర్యలను ముమ్మరం చేసాయి. ఈ నేపథ్యం లో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రధాని ముఖ్య మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. ఈ కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎపి లోని పరిస్థితి గురించి మోడీ కి వివరించారు.
     ఉన్నపళం గా రెండు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లో కేసులు పెరిగిన సంగతి తెల్సిందే. దీనిపై సీఎం జగన్ మోడీకి వివరణ ఇచ్చారు.  ఏపీలో ఇప్పటివరకు 132 కేసులు నమోదయ్యాయని, వారిలో 111 మంది ఢిల్లీలో జరిగిన జమాత్‌ సభకు వెళ్లిన వారు, వారితో సన్నిహితంగా ఉన్నవారేనని ఆయన తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి క్వారంటైన్‌కు తరలిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ, ఎపి ఆదాయం బాగా దెబ్బతిందని, కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి ఎపి ని ఆదుకోమని కోరారు. ఇంకా అవసరమైన వైద్య పరికరాలను కూడా అందించాలని కోరారు.