ఏపీ లో 132 కు చేరిన కరోనా కేసులు..!

post

ఆంధ్ర ప్రదేశ్ లో కేసుల సంఖ్యా మరింత పెరిగింది. బుధవారం రాత్రి పది గంటల తరువాత విడుదల అయినా ల్యాబ్ ఫలితాలలో మరో 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో కేసుల సంఖ్య 111 నుంచి 132 కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. మొదట ఆంధ్ర ప్రదేశ్ లో కేసుల సంఖ్య తక్కువ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఢిల్లీ లోని నిజాముద్దీన్ ప్రాంతం లో జరిగిన మత ప్రార్ధనల కార్యక్రమాలకు ఆంధ్ర ప్రదేశ్ నుంచి కూడా ఎక్కువ మంది హాజరు కావడం తో, అక్కడి నుంచి వచ్చిన వారిలో చాలా మంది కి కరోనా పాజిటివ్ వస్తోంది.