పోలీసుకు ఎమ్మెల్యే పాదాభివందనం..!

post

కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా పోలీసు బలగాలు శక్తివంచన లేకుండా పని చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తమ ఆరోగ్యాలను సైతం ఫణంగా పెట్టి పోలీసులు, వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తమ విధులను నిర్వర్తిస్తున్నారు.

తాజాగా, విశాఖపట్నం జిల్లా అరకు వ్యాలీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ స్థానిక ఏఎస్ఐ మోహన్‌కు పాదాభివందనం చేసి ఆయన సేవలను కొనియాడారు. కరోనా నియంత్రణలో భాగంగా అద్భుతంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఫాల్గుణ పాదాభివందనం చేస్తుండగా.. ఏఎస్ఐ గౌరవ సూచకంగా సెల్యూట్ చేస్తూ నిలుచున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 లాక్ డౌన్‌ను విజయవంతం చేయడానికి పోలీసులు తమ కుటుంబాలకు సైతం దూరంగా ఉంటూ విచేస్తున్న సేవలను కొనియాడుతూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ సవాంగ్ సైతం బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే.