పోలీసులు, డాక్టర్లకు రోజా వంట..!

post

కరోనా నేపధ్యంలో డాక్టర్లు, మెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులప్రజల కోసం 24 గంటలు కష్టపడుతున్నారు. వీరికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా. వారికి భోజన సదుపాయం కల్పించారు.రోజా చారిటబుల్ ట్రస్ట్' ద్వారా ప్రతిరోజు వారికి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.

 . దీని కోసం ఆమె స్వయంగా కూరగాయలు తరిగి, వంటలు చేశారు. లాక్ డౌన్ కొనసాగుతుండటంతో 'వంట చేసేవారికి రోజా తనవంతు సాయం అందించారు. అనంతరం తన చేతుల మీదుగా పోలీసులకు భోజనం వడ్డించారు.ప్రజల కోసం తమ కుటుంబాలను వదిలి రాత్రి, పగలు తేడా లేకుండా సమాజ సేవ చేస్తున్న పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులకు అన్నం పెట్టే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఎండల్ని సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నారని.. ప్రతి ఒక్కరూ వారికి సహకారం అందించాలన్నారు. ఎవరి ఇళ్లలో వారే ఉండాలని సూచించారు. అందరూ బాధ్యతగా ఉండాలన్నారు.. కరోనా లక్షణాలు ఉంటే అధికారుల్ని సంప్రదించాలన్నారు.