లాక్ డౌన్ కారణం గా చిక్కుకున్న నెల్లూరు వాసులు..!

post

ఆంధ్రప్రదేశ్ కు చెందిన నెల్లూరు ప్రాంత వసూలు పాతిక మంది వరకు కలిసి కాశీ యాత్రకు వెళ్లారు. ఐతే, ఈలోపు మార్చి ఇరవై రెండవ తేదీన జనతా కర్ఫ్యూ విధించడం తో వీరు అక్కడ చిక్కుకుపోయారు. నిజానికి మార్చి 23 వ తేదీ కు వారికి రిజర్వేషన్ ఉంది. కానీ జనతా కర్ఫ్యూ తో మొదలైన లాక్ డౌన్ 23 వ తారీకు కు కూడా కొనసాగింది. దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీనితో వీరంతా కాశీలోని చిక్కుకుపోయారు. వీరు ఆందోళన వ్యక్తం చేస్తూ నెల్లూరు జిల్లా కలెక్టరు కు కాల్ చేసారు. అధికారులు తక్షణమే స్పందించారు. వీరిని రప్పించే ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్పుకొచ్చారు.