తిరుపతి లో ధర్నా..!

post


వైద్యులు సేవలందించడానికి ఆసుపత్రికి వెళుతున్న సమయం లో పోలీసులు అడ్డుకుని చేయి చేసుకున్న ఘటన తిరుపతి లో జరిగింది. దీనితో వారంతా లీలామహల్ సెంటర్ వద్ద ధర్నా ప్రారంభించారు. తమపై చేయి చేసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
  వివరాల్లోకెళితే, తాము ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు చికిత్స చేస్తుంటే, పోలీసులు అడ్డుకుంటున్నారని, దారుణంగా తిడుతూ, తమను కొట్టారని కొందరు మెడికో లు ఆరోపిస్తున్నారు. సేవల నిమిత్తం ఆసుపత్రి కి వెళ్తున్న సమయం లో పోలీసులు అడ్డుకున్నారని వారు  చెప్తున్నారు. తాము చెప్పేది వినిపించుకోకుండా తమను కొట్టారని వాపోయారు.దీనితో ధర్నా ప్రారంభించామని చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకొని శాఖాపరమైన విచారణ జరిపారు. బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు. దీనితో, వారు ధర్నా విరమించారు.