ధరలు పెంచితే జైలుకే..!

post

ప్రజలలో కరోనా భయం బాగా పెరిగింది. ఐతే, దీనిని వ్యాపారస్తులు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. దీనికొటోడు, ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించడం తో వారు ఇదే అదను గా భావిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో ధరలు పెంచుతున్నట్లు  ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనితో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ అంశం పై ఏపీ మంత్రి కోడలి నాని తీవ్రం గా స్పందించారు. ఇకపై ఎవరైనా నిత్యావసర ధరలను పెంచి అధికం గా సొమ్మును వాసులు చేస్తే చట్టపరం గా శిక్షలు తప్పవని హెచ్చరించారు. 
    కేసులను నమోదు చేయడమే కాకుండా, అవసరం ఐతే వారిని జైలు  కు పంపడానికి కూడా వెనుకాడమని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వమిచ్చిన లాక్ డౌన్ పిలుపుకు ప్రజలంతా సహకరించాలని, ఇది రాష్ట్రానికే కాకుండా, ప్రజలకు కూడా మంచిదని  ఆయన చెప్పారు. ఈ నేపధ్యం లో ఆయన ఇంకా మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈనెల 29 వ తేదీన రేషన్ కార్డు దారులందరికి ఉచితం గా సరుకులు ఇస్తామని ఆయన చెప్పుకొచ్చారు. కిలో కందిపప్పు ను కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.