మటన్, చికెన్ కంటే కూడా అత్యధిక పోషకాలు కలిగి ఉన్న కూరగాయ బోడ కాకర కాయ.. దీనినే బొంత కాకర కాయలు అని కూడా అంటారు
శాఖాహార భోజనం చేసే వారికి ఇది అద్భుతమైన కూరగాయ అని చెప్పాలి. ఈ వర్షాకాలంలో ఇవి ఎక్కువగా దొరుకుతాయి.
బోడ కాకర కాయలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం, ఈ కూరగాయలను ఎక్కువగా తినటం వల్ల నాడీ వ్యవస్థ వ్యాధులకు చికిత్సగా పనిచేస్తుంది.
ఈ కూరగాయలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి బోడ కాకర కాయ ప్రయోజనకరంగా ఉంటుంది.
బోడ కాకర కాయను తినడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.