మిరపకాయను మన దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే... అస్సాంలో లభించే భోట్ మిరపకాయలకు కొన్నిప్రత్యేకతలు ఉన్నాయి.
దీని శాస్త్రీయ నామం కాప్సికల్ చైనీస్. దీనిని మిరపకాయల రాజు అంటారు. ఎందుకంటే ఇది ఇతర మిరపకాయల కంటే పరిమాణంలో చాలా పెద్దది, బాగా కారంగాను ఉంటుంది..
భోట్ మిరపకాయ లేదా దెయ్యం మిరపకాయలు భారతదేశం ఉత్పత్తి చేసే అత్యంత కారమైన మిరపకాయ.
2007లో ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉన్న మిరపకాయగా వోట్ చిల్లీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.
మిరపకాయలు 2.5 నుండి 3.5 అంగుళాల పొడవు మరియు 1 నుండి 1.5 అంగుళాల వెడల్పు ఉంటాయి. రంగు రకాలు ఎరుపు, పసుపు , నారింజ.