శరీర ఆరోగ్యానికి జీర్ణవ్యవస్థ చాలా కీలకం. తినే ఆహారం జీర్ణవ్యవస్థలో జీర్ణమవుతాయి. వాటి నుంచి పోషకాలు గ్రహించబడి శరీరం అంతటికి అందుతాయి.
సుమారు 39 ట్రిలియన్ సూక్ష్మజీవులు మన జీర్ణవ్యవస్థలో ఉంటాయి. ఇవే జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉంచుతాయి.
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం దెబ్బతింటే.. జీర్ణ సమస్యలు, మలబద్ధకం, ప్రేగు సమస్యలు సహా ఇతర సమస్యలు చుట్టు ముడతాయి. జీర్ణ వ్యవస్థను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం
జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండాలంటే రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. శరీరంలో తగినన్ని నీళ్లు ఉంటే జీర్ణవ్యవస్థ ప్రభావవంతంగా ఉంటుంది.
ఫైబర్, విటమిన్లు ఖనిజాలు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మాంసం, పెరుగు వంటివి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే పోషకాలతో నిండి ఉంటాయి.
వ్యాయామం శరీర ఆరోగ్యాన్ని అన్నిరకాలుగా మెరుగ్గా ఉంచుతుంది. పేగు కండరాల పనితీరును, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఒత్తిడి కేవలం మానసికమైనదే అనుకుంటే పొరబడినట్లే. ఒత్తిడి మానసికంగా, శారీరకంగా కూడా ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది
సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. సోంపు కూడా మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.