ఇంగువ(హింగ్).. చూసేందుకు బెల్లంలాగే కనిపిస్తుంది. నోట్లో పెట్టుకుంటే మాత్రం భరించలేనంత వగరు.
రోజువారీ ఆహారంలో ఇంగువను భాగం చేసుకుంటే అనేక ఉపయోగాలు.
జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టి.. జీవక్రియను మెరుగు పరుస్తుంది.
ఒంట్లో ఉన్న వేడిని బయటికి పంపడంలో ఇంగువకు సాటి లేదు. శ్వాస సమస్యలకు కూడా ఇంగువ మంచి ఔషధం.
పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి నుంచి ఇంగువ ఉపశమనం ఇస్తుంది.
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని కాస్తంత ఇంగువ పొడి వేసుకుని.. అన్నం తిన్న అరగంట తర్వాత తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు.
భోజనం తర్వాత చిటికెడు ఇంగువను మజ్జిగలో కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. తొందరగా జీర్ణమవుతుంది.