వెల్లుల్లిలో యాంటీబ్యాక్టిరియా లక్షణాలు ఉంటాయి. విటమిన్ బి6, విటమిన్ సి, మ్యాంగనీస్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి
వెల్లుల్లి అంటే తెలుపు రంగులో ఉంటుంది అని అందరికీ తెలుసు.. కొంతమందికి నల్ల వెల్లుల్లి గురించి కూడా తెలుసు. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు గులాబీ రంగు వెల్లుల్లిని ఆవిష్కరించారు.
బీహార్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ వెల్లుల్లిలో కొత్త మెరుగైన రకమైన గులాబీ వెల్లుల్లిని అభివృద్ధి చేసింది.
గులాబీ వెల్లుల్లి నిల్వ సామర్థ్యం తెల్ల వెల్లుల్లి కంటే చాలా ఎక్కువ. ఎంత కాలమైనా సరే మీరు ఇంటి లోపల ఈ గులాబీ వెల్లుల్లిని నిల్వ చేసుకోవచ్చు.
ఆరోగ్యానికి మేలు చేసే కొత్త రకం గులాబీ వెల్లుల్లిలో సల్ఫర్ , ఫాస్పరస్ పరీక్ష జరిగింది. గులాబీ రంగు వెల్లుల్లి మొక్కలకు రోగాలు దరిచేరవని చెబుతున్నారు.