ఎముకలు కండరాలతో పాటు నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా మార్చడంలో కాల్షియం సహాయపడుతుంది. దంతాలను దృఢంగా మార్చడంలో కాల్షియం ఉపయోగపడుతుంది

శరీరానికి కాల్షియం ఎంతో అవసరం అధిక మోతాదులో కాల్షియం సరైనది కాదు.

18 ఏళ్ల వయస్సు దాటిన వారికి రోజుకు 700 మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం అవుతుంది. 

కాల్షియం ఎక్కువగా చేపలు, పాల పదార్థాలతో దొరకుతుంది

శరీరంలో కాల్షియం ఎక్కువగా అయితే కంటికి సంబంధించిన సమస్యలతో పాటు అనేక సమస్యలు వస్తాయి

ముఖ్యంగా అవసరానికి మించి కాల్షియం తీసుకోవడంతో జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయదు. దీనితో మలబద్ధకం సమస్య వచ్చే ప్రమాదం ఉంది

శరీరంలో కాల్షియం స్థాయిలు అధికం కావడంతో తలనొప్పి ఎక్కువ అవుతుంది

కాల్షియం కంటెంట్ ఎక్కువ అవ్వడంతో మూత్రపిండాలు సరిగ్గా పనిచేయవు. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం రెట్టింపు అవుతుంది

ఇతర వ్యాధులతో బాధపడేవారు మందులు వినియోగిస్తారు అటువంటి వారు కాల్షియం కంటెంట్ ఎక్కువగా తీసుకోవడంతో మందుల ప్రభావం తగ్గుతుంది

శరీరంలో కాల్షియం కంటెంట్ ఎక్కువ అవడంతో ప్రోస్టేట్ క్యాన్సర్, గుండె జబ్బులు మరియు ఎక్కువసార్లు మూత్రం వచ్చే ప్రమాదం ఉంటుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం