వేసవి కాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది సాయంత్రం పూట స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా దానికి ఎంతో ఆరోగ్యకరంగా ఉండే స్నాక్స్ ఇవి ట్రై చెయ్యండి

పండ్లు అరటి, ఆరెంజ్, ద్రాక్ష, స్ట్రాబెర్రీస్ ఇలా నీరు శాతం ఎక్కువగా పండ్లు ఏమైనా తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.

మొలకలు తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది

నువ్వుల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. నువ్వలతో చేసిన లడ్డూ ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది

వేరుశనగలు తినడంతో శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. శనగల్లో బెల్లం కలుపుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం లభిస్తుంది

బఠాణీలో ఫైబర్,  ప్రోటీన్ అధికంగా ఉంటుంది.

డ్రైఫ్రూట్స్ జీడిపప్పు బాదం కిస్ మిస్ వాల్ నట్స్ వేర్వేరుగా కానీ మిక్స్ చేసుకుని తినంతో కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది

ఉడికించిన వేరుశనగల్లో ఉల్లిపాయలు టమోటాలు కొత్తిమీర నిమ్మకాయ కలిపి చాట్ చేసుకుని తినడం వల్ల రుచితో పాటు హెల్త్ కి మంచిది.

వేసవిలోని స్నాక్స్ క్రేవింగ్స్ కు చక్కటి ఆహారంగా  అటుకులను పరిగణిచవచ్చు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం