మామిడి పండ్లు చాలామందికి అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి. మరి ఎవరు మామిడి పండ్లను తినకూడదో తెలుసుకుందాం
మామిడిపండ్లు.. విషపూరితమైన పాయిజన్ ఐవీ, పాయిజన్ ఓక్ జాతి చెట్లకు చెందినవి. కొంతమందికి మామిడిని తిన్నప్పుడు అలర్జీ వస్తుంది. చర్మంపై దురద, పొక్కులు, దద్దుర్ల వంటివి వస్తాయి.
కొంతమందికి పొల్లెన్ అలర్జీ ఉంటుంది. అంటే.. వారు ఏదైనా తిన్నప్పుడు నోట్లో దురద, పొక్కులు, గొంతు నొప్పి, పెదవులకు సమస్యలు వస్తాయి.
మామిడిలో పిండి పదార్థం రూపంలో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు.. మామిడిని తింటే.. షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి.
కొంతమందికి కడుపులో సమస్యలు ఉంటాయి. వారికి ఏది తిన్నా గ్యాస్ పుడుతుంది. మరికొందరికి ఇర్రిటబుల్ బొవెల్ సిండ్రోమ్ (IBS) సమస్య ఉంటుంది. వారు మామిడికి దూరంగా ఉండడం మంచిది
మామిడిలో ఫ్యురానోకోమారిన్స్ వంటి పదార్థాలు ఉంటాయి. లివర్ సమస్యలు ఉన్నవారికి ఈ పదార్థాలు సమస్య అవుతాయి.
మామిడిని ఎక్కువగా తింటే కడుపులో తేడా చెయ్యగలదు. గ్యాస్ తెప్పించే ఆహారంతో కలిపి మామిడి తింటే కడుపులో పెద్ద సమస్యే వస్తుంది.
మామిడిని ఒకేసారి మరీ ఎక్కువగా తినకూడదు. జ్యూస్ చేసుకొని తాగొచ్చుగానీ.. అందులో షుగర్ వేసుకోవడం మంచిది కాదు.