నేరుడు పండ్లను కొన్ని ఇతర పదార్థాలతో కలిపి తినకూడదని నిపుణులు అంటున్నారు.

నేరేడు పండుతో పాటు పసుపును తీసుకోవద్దు.రెండింటి కలయిక వల్ల కడుపు నొప్పి వస్తుంది.

నేరేడు పండు,పాలు కలిపి తినవద్దు. వాటిని కలిసి లేదా ఒకే సమయంలో తింటే, అది జీర్ణక్రియను పాడు చేస్తుంది , గ్యాస్ ఉత్పత్తికి కారణమవుతుంది.

పచ్చళ్లు, నేరేడు పండు కలిపి తినకూడదు. ఈ రెండింటి కలయిక వల్ల విష ప్రభావం ఏర్పడుతుంది.

నేరేడు పండ్లను ఖాళీ కడుపుతో తినవద్దు. ఇది కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ మరియు విరేచనాలను పెంచుతుంది.

ఇకపోతే నేరేడు పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి నేరేడులో ఉండే అన్ని పోషకాలు శరీరం సరైన రీతిలో పనిచేయడానికి సహాయపడతాయి.

మధుమేహం, రక్తహీనత, ఇన్ఫెక్షన్ మొదలైన సమస్యలను నియంత్రించడంలో మరియు తొలగించడంలో నేరేడు సహాయపడుతుంది.

పర్పుల్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఫాస్పరస్ మరియు ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

ఈ ఊదా పండు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుందని అంటారు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం