అనారోగ్యకరమైన జీవన శైలి వల్ల కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది.

జ్యూస్ లు కడుపు ఉబ్బరం సమస్యను పరిష్కరించడంతో పాటు కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తాయి.

మరి కడుపు ఉబ్బరం సమస్యను తగ్గించడానికి తోడ్పడే జ్యూస్ లు ఏంటో చూసేద్దాం

కీరదోసకాయల్లో నీటి పరిమాణం చాలా ఎక్కువ. ఇది శరీరంలో నీటి కొరతను పోగొడుతుంది. ఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది.

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అలాగే అల్లం జీర్ణవ్యవస్థలో మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. ఆ మంట ఉబ్బరానికి దారితీస్తుంది.

బీట్ రూట్ జ్యూస్ లో బీటైన్ ఉంటుంది. ఇది కాలేయ పనితీరుకు సహాయపడుతుంది. నిర్విషీకరణకు సహాయపడుతుంది.

నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కాలేయాన్ని ఉత్తేజపరుస్తుంది. నిర్విషీకరణ ప్రక్రియకు సహాయపడుతుంది. ఇది మూత్రవిసర్జన ప్రభావాన్ని కూడా కలిగి ఉంటుంది.

ప్రతి రోజూ ఉదయం పుదీనా ఆకులు రసం లేదా పుదీనా టీ తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం