మన శరీరానికి విటమిన్ బి 12 చాలా చాలా అవసరం. ఇది లోపిస్తే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో జబ్బులు వస్తాయి.

విటమిన్ బి 12 స్థాయిలు తక్కువగా ఉంటే.. హృదయ స్పందన రేటు బాగా పెరుగుతుంది.

శరీరంలో విటమిన్ బి 12 లేకపోవడం వల్ల నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది. విటమిన్ బి12 లోపం వల్ల నోటి పూత, నాలుక వాపు వంటి సమస్యలు వస్తాయి.

చేతులు, కాళ్లలో జలదరింపు కూడా విటమిన్ బి12 లోపమే. దీనివల్ల కాళ్లు, చేతుల్లో సూదులతో పొడుస్తున్నట్టే అనిపిస్తుంది.

శాఖాహారం తినేవారికే విటమిన్ బి 12 లోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ విటమిన్ ఎక్కువగా మాంసం ఆధారిత ఆహారాలలోనే ఉంటుంది.

నట్స్ డ్రైప్రూట్స్ వంటి పదార్థాల్లో విటమిన్  బి12 ఎక్కువగా లభిస్తుంది

చేపలు, కాలేయం, ఎర్ర మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులలో విటమిన్ బి 12 పుష్కలంగా లభిస్తుంది.

టైప్ 2 డయాబెటిస్ డ్రగ్ అయిన మెట్ఫార్మిన్ తీసుకునేవారికి విటమిన్ బి 12 తక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉంది.

విటమిన్ బి 12 లోపం వల్ల అల్జీమర్స్ వ్యాధి, వాస్కులర్ చిత్తవైకల్యం, పార్కిన్సన్ వ్యాధి వంటి మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయని వెల్లడిస్తున్నాయి.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం