అయితే అన్నాన్ని సరిగ్గా నిల్వ చేయకుండా మిగిలిపోయింది కదా అని తింటే అనేక సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు
అన్నం వండిన తర్వాత మిగిలిపోయిన అన్నాన్ని గంటల తరబడి ఉంచడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది.
బియ్యంలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా కలుషితమైనప్పుడు ఆహారంలో పెరిగి ఆహారాన్ని విషపూరితం చేస్తుంది
బి.సెరియస్ ఉత్పత్తి చేసే విషం వేడికి కూడా పోదు. అందుకే తినడానికి ముందు మిగిలిపోయిన అన్నాన్ని మళ్లీ వేడి చేసినా కూడా ఈ బ్యాక్టీరియా చనిపోదు. అంతేకాదు ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం కూడా ఉంది.
40 డిగ్రీల ఫారెన్ హీట్ (4 డిగ్రీల సెల్సియస్) కంటే తక్కువగా ఉంచిన రిఫ్రిజిరేటర్ లో భద్రపరిస్తే నాలుగు రోజుల వరకు పాడవకుండా ఉంటుంది.
కాబట్టి అన్నాన్ని సరిగ్గా నిల్వ చేయకుండా తింటే వాంతులు , మోషన్స్ తో పాటుగా ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ అయ్యే సమస్య కూడా ఉంటుంది