క్రికెట్ ప్రపంచానికి రారాజు.. క్రికెట్ గాడ్.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్

1989 నుంచి 2013 వరకు 463 వన్డే మ్యాచ్‌లు ఆడిన సచిన్.. రికార్డుల మోత మోగించారు.

వన్డేల్లో 49 సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ సచిన్ మాత్రమే. టెస్టుల్లోనూ అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ సచినే.

200 టెస్ట్ మ్యాచ్ 329 ఇన్నింగ్స్ ఆడిన సచిన్.. 51 సెంచరీలు చేశాడు. రెండు ఫార్మాట్లలోనూ సచిన్ 100 సెంచరీలు చేశాడు.

వన్డే క్రికెట్ చరిత్రలో ఫస్ట్ డబుల్ సెంచరీ సచిన్ పేరుపైనే ఉంది.

భారత్‌లో భారతరత్న పొందిన మొదటి క్రీడాకారుడు సచిన్.

వరల్డ్ కప్‌లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌లు (9) పొందిన క్రికెటర్ సచిన్.

రాజ్యసభకు నామినేట్ అయిన ఫస్ట్ క్రికెటర్ కూడా సచినే.

2010లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సచిన్ ను కెప్టెన్ ర్యాంక్ హోదాతో గుర్తించింది.

సచిన్ అనేది పేరు కాదు ఎమోషన్.. ఐడియల్ పర్సనాలిటీ.. క్రికెటర్ గానే కాకుండా మానవతావాదిగానూ ఆయనకు అనేక మంది అభిమానులు ఉన్నారు

సచిన్ 50 నాటౌట్ అంటూ ఆయనకు 50వ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం