సాధారణంగా చిన్నపిల్లలకు 6 నెలలు లేదా ఏడాది లేదా వారి మొక్కులకు అనుగుణంగా పుట్టెంటుకలు తీస్తుంటారు.
తల్లి గర్భంలో శిశువు 9 నెలలు ఉమ్మనీరులో ఉంటుంది. దానివల్ల పలు బ్యాక్టీరియాలు ఉంటాయి
ఇక స్నానం చేయించినప్పుడు శరీరంపై, తల భాగంలో ఉన్న క్రిములు పోయినప్పటికీ కూడా ఇంకా కొన్ని క్రిములు తల భాగంలో అలాగే ఉండిపోతాయి.
ఈ బాక్టీరియా కారణంగా చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడుతుంటారు. ఈ కారణంగానే చిన్న పిల్లలకు పుట్టెంటుకలు తీస్తుంటారు.
ఇక గుండు చేయించడం వల్ల పిల్లల మాడుకు నేరుగా సూర్యరశ్మి తాకడంతో పిల్లల ఎదుగుదల..డి విటమిన్ పుష్టిగా అందుతాయి. రక్తప్రసరణ బాగా జరుగుతుంది
అయితే చాలా మంది మొక్కు కోసమే పుట్టెంటుకలు తీస్తున్నాం అనుకుంటారు. కానీ దానివెనుక పరమార్ధం ఇది