తెలుగు క్యాలెండర్ ప్రకారం, ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు.

హిందూ పురాణాల ప్రకారం, శ్రావణ మాసం పరమేశ్వరునికి అంకితం ఇవ్వబడింది. కాబట్టి ఈ మాసంలోని పౌర్ణమి రోజున పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేయాలి.

హిందూ మత విశ్వాసాల ప్రకారం, భద్ర కాలాన్ని అశుభ సమయంగా భావిస్తారు.ఈ సమయంలో సోదరులకు రాఖీ కట్టకూడదు.

శ్రావణ పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం చాలా ముఖ్యమైనది. రక్షా బంధన్ రోజున సోదరులకే కాదు.. కొత్త మరియు పాత వస్తువులను కూడా రాఖీ కట్టొచ్చు.

రాఖీ కట్టే వేళ తన ముఖం దక్షిణం వైపున అస్సలు ఉండకుండా చూసుకోవాలి.మీ సోదరికి పదునైన వస్తువులు బహుమతులుగా ఇవ్వొద్దు.