Breaking News

బాబు గారి మనసు..ఢిల్లీ చుట్టూ..: విజయ సాయి రెడ్డి

09 th Jun 2020, UTC

వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ని, ఆయన తనయుడు లోకేష్ పైన వరుస ట్వీట్లతో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు పై విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఇదేమి మొదటి సారి కాదు. ఇప్పటికే పలుసార్లు ఆయన ట్విట్టర్ మాధ్యమం ద్వారా తనదైన శైలిలో ప్రతిపక్షాలను తిట్టిపోస్తూ ట్వీట్లు వేస్తుంటారు.
 
          తాజాగా.. వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి  చంద్రబాబు మనసంతా ఢిల్లీ లో నే ఉంటుందంటూ మరో సారి విమర్శలకు దిగారు. "హైదరాబాద్‌లో ఉన్నా బాబు గారి మనసంతా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతోంది. మోదీ, అమిత్ షా గార్ల కాళ్లు పట్టుకోవడం ఎలా అనే దానిపై వర్కవుట్ చేస్తున్నాడు. బీజేపీ కి దగ్గర కావాలని తన మనుషులతో ఇప్పటికే అనిపించాడు. ఎల్లో మీడియా ఎంటరై అదొక చారిత్రక అవసరమన్నట్టు వరస కథనాలు వడ్డిస్తుందని" ఆయన పరోక్షం గా చంద్రబాబు కు వంత పాడే మీడియా ను కూడా విమర్శించారు.
 
         అంతే కాకుండా.. నారా లోకేష్ పైన కూడా విమర్శల వర్షం కురిపించారు. "లోకేశ్ బాబు ఆవేశం చూస్తుంటే ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టే కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా తనను కాదని తండ్రి మరొకరిని ఎంపిక చేయడం వల్ల తన్నుకొచ్చిన 'ఆవేదన తాలూకు ఉద్రేకం' బయటపడినట్టు అనిపిస్తోంది. పనికిరాడని సొంత తండ్రే సర్టిఫై చేస్తే తన ఫ్యూచర్ ఏమిటని కుంగిపోతున్నాడు పాపం!" అంటూ విజయసాయి రెడ్డి తన ట్వీట్ లో పోస్ట్ చేసారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox