Breaking News

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం..!

05 th Jun 2020, UTC
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం..!
మానవ జీవిత ప్రకృతి తో మమేకమైనది.. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి. వంటి పంచ భూతాలు లేకుంటే... మానవ మనుగడ అసాధ్యం. సాంకేతికం గా మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా వీటిని పరిరక్షించుకోలేకపోతే... మానవ జీవిత వ్యర్థం. కానీ... రాను రాను మనుషులు కనిపెడుతున్న సాంకేంతికత కు ప్రకృతి బలి అవుతోంది. ఈ భూమండలం కాలుష్యమైపోయింది. భూమి ఉపరితలం లో ఉన్న వనరులతో పాటు.. భూమి లోపల ఉన్న ఖనిజాలను నిక్షేపాలను సొంతం చేసుకోవడం కోసం.... మనిషి భూమికే తూట్లు పొడిచాడు. రోజురోజుకూ భూగోళంపై పచ్చదనం తగ్గిపోవడం, కొన్ని రకాల జీవరాశులు నశించిపోవడం వంటివి... పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి..
                    పరిశ్రమలు, వాహనాలు తదితరాల నుంచి వెలువడుతోన్న క్లోరోఫోరో కార్బన్‌లు భూగ్రహాన్ని మరింత వేడెక్కిస్తూ పలు కాలుష్యాలకు కారణమవుతున్నాయి. భూతాపం పెరగడంవల్ల పర్యావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుని జీవరాశుల మనుగడకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరోవైపు వాతావరణంలో మార్పుల కారణంగా జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. వృక్షాలను విచక్షణారహితంగా నరికివేస్తున్నందున అడవులు అంతరించిపోతున్నాయి. సరైన వర్షాలు లేక కరువుకాటకాలు సంభవిస్తున్నాయి. మరోవైపు జలవనరుల కొరత ఏర్పడుతోంది. అకాల వర్షాలు, విపరీతమైన వేడిమి కారణంగా గ్లోబల్ వార్మింగ్‌తో ఓజోన్ పొర దెబ్బతింటోంది.
                 ప్రస్తుతం కరోనా మహమ్మారి తో ప్రపంచం అల్లకల్లోలం గా ఉంది. ఇష్టారాజ్యం గా పంచభూతాలను నాశనం చేస్తున్న మనిషికి ప్రకృతే గుణపాఠం నేర్పినట్లుంది ప్రస్తుత పరిస్థితి.. లాక్‌డౌన్‌ వల్ల అన్ని పనులు ఆగిపోవడంతో కర్బన ఉద్గారాలూ తగ్గాయి. భారతదేశంలోనూ ప్రజా రవాణా నిలిచిపోయి ఇంధనాల వాడకం దాదాపు 66 శాతం తగ్గింది. ఇంధనానికి డిమాండు తగ్గడంతో చమురు ఉత్పత్తీ, బొగ్గు తవ్వకాలు తగ్గిపోయాయి. ఫలితంగా చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో అన్ని రకాల కాలుష్యాలకూ అడ్డుకట్ట పడింది. పవిత్రమైన గంగా, యమునా నదులు ఎంత కాలుష్యం తో కురుకుపోయాయో తెలియనిది కాదు.. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా... గంగను బాగుచేయడం ఎవరి తరం కాలేదు. అలాంటిది లాక్‌డౌన్‌‌తో ఫ్యాక్టరీల మూసివేయడం వల్ల వ్యర్థాలు నదిలోకి రావడం ఆగిపోయి గంగమ్మ కొత్త అందాలను సంతరించుకుంది. 
                 ప్రకృతి ని కాపాడుకోవాలనే అవగానను పెంచడం కోసం ప్రతి ఏటా జూన్ ఐదవ తేదీన పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తారు. 1972లో తొలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ప్రతి ఏడాది ఒక్కో థీమ్ తో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. 2019 సంవత్సరంలో ‘బీట్ ఎయిర్ పొల్యూషన్’పేరుతో చైనాలో సదస్సు నిర్వహించారు. ఈ ఏడాది ‘టైమ్ ఫర్ నేచర్’ థీమ్‌ను ఎంపిక చేసి.. జర్మనీ సహకారంతో కొలంబియాలో నిర్వహిస్తున్నారు.భూమిపై ఉన్న జీవవైవిధ్యంలో 10 శాతం కొలంబియాలోనే ఉంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో భాగం కావడం వల్ల అది సాధ్యమైంది. పక్షులు, ఆర్చిడ్స్ బయోడైవర్సిటీ కేటగిరిలో కొలంబియా తొలి స్థానంలో ఉంది. మొక్కలు, సీతాకోకచిలుకలు, స్వచ్ఛమైన నీటిలో లభించే చేపలు, ఉభయచరాల్లో రెండో స్థానంలో ఉంది. అందుకే .. ఈ సారి సదస్సుని అక్కడ నిర్వహిస్తున్నారు. 
            ప్రస్తుత పరిస్థితులు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను సూచిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల ద్వారా కరువు కాటకాలు.. తద్వారా జంతువులూ అంతరించిపోవడం... దీనితో... పర్యావరణానికి మరింత ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాలుష్యాన్ని అంతరించడం కోసం.. మొక్కలు పెంచుకోవడాన్ని ఓ వ్యాపకం గా మార్చుకోవాలని చెబుతున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox