Breaking News

చైనా పై ప్రధాని మౌనం ఎందుకు?:రాహుల్ గాంధీ

10 th Jun 2020, UTC

లడఖ్‌లోని కొంత భూభాగాన్ని చైనా స్వాధీనం చేసుకుందని, అయినా సరే... ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ విషయంపై మోదీ అసలు మాటే మాట్లాడటం లేదని, అదృశ్యమయ్యారని ఆయన ఆరోపించారు.

చైనా లడఖ్‌లోకి వెళ్లి మన భూభాగాన్ని ఆక్రమించారు. మరోవైపు మోదీ మాత్రం ఈ విషయంపై నోరు మెదపడం లేదు. అదృశ్యమయ్యారు అని ట్విట్టర్ వేదికగా రాహుల్ మండిపడ్డారు. సైనిక స్థాయిలో చర్చల సందర్భంగా చైనా కఠినంగా వ్యవహరించిందని గాల్వన్ వ్యాలీ మరియు పాంగోంగ్లోని కొన్ని ప్రాంతాలకు చైనా ఆక్రమించుకుందని వచ్చిన ఓ వార్తా కథనాన్ని కూడా రాహుల్ జత చేశారు.

బీజేపీ ఎంపీ కౌంటర్

మరో వైపు బీజేపీ ఎంపీ జామ్ యామ్ సెరింగ్ నాగ్యాల్  రాహుల్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అవును... చైనా భారత భూభాగాన్ని ఆక్రమించింది. అది కాంగ్రెస్ హయాంలోనే అంటూ ఓ జాబితాను ఆయన ట్వీట్ చేశారు. 1962 లో కాంగ్రెస్ హయాంలో 37,244 చ.కి.మీ. అక్రాయిన్ చిన్ ప్రాంతాన్ని ఆక్రమించిందని, 2008 లో చుముర్ ప్రాంతంలోని తియా పన్‌గ్నక్ అండ్ చబ్జీ లోయను ఆక్రమించుకుందని పేర్కొన్నారు.

డెమ్‌జోక్‌లోని జోరవర్ కోటను 2008 లో చైనా సైన్యం నాశనం చేసిందని, మరియు 2012 యూపీఏ పాలనలో చైనా సైన్యం ఓ అబ్జర్వింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేసి 13 సిమెంట్ ఇళ్లతో ఏకంగా ఓ కాలనీయే ఏర్పాటు చేసిందని ఆయన వెల్లడించారు. ఈ విషయాలన్నింటినీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంటుందని తాను భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, మరోసారి ఇలా తప్పుదోవ పట్టించకుండా ఉంటారని తాము ఆశిస్తున్నట్లు ఎంపీ జామ్ యామ్ సెరింగ్ నాగ్యాల్ తెలిపారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox