Breaking News

పూజాకు నచ్చిన క్రికెటర్ రాహుల్ ద్రావిడ్..!

05 th Jun 2020, UTC

టాలీవుడ్‌లో వరుస హిట్స్‌తో దూసుకపోతున్న హీరోయిన్‌ పూజా హెగ్డే  సోషల్‌ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా లైవ్‌ చాట్‌లో పాల్గొన్న ఈ బ్యూటీ ఫ్యాన్స్‌, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో మీ ఫేవరేట్‌ క్రికెటర్‌ ఎవరని ఓ నెటిజన్‌ ప్రశ్నించాడు.

దీనికి  పూజా హెగ్డే తనకు ఇష్టమైన క్రికెటర్‌ మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంటూ ఠక్కున సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా తాను ద్రవిడ్‌కు వీరాభిమానినని, ఈ తరంలో ఎంతమంది గొప్ప ఆటగాళ్లు ఉన్నా అతడికి సాటిరారని తేల్చిచెప్పారు. ది వాల్‌ ఓ కూల్‌ అండ్‌ క్లాసిక్‌ ప్లేయర్‌ అని పేర్కొన్నారు. ప్రస్తుత ఆటగాళ్లలో ధోని, కేఎల్‌ రాహుల్‌ ఆటతీరు నచ్చుతుందన్నారు. ఇక ఎంత బిజీగా ఉన్నా టీమిండియా మ్యాచ్ జరుగుతుంటే కనీసం స్కోర్ తెలుసుకోవడానికైనా ప్రయత్నిస్తానని క్రికెట్ పట్ల తనకున్న ఇష్టం అలాంటిదని పూజా హెగ్డే తెలిపారు.

ఈ బుట్టబొమ్మ శుక్రవారం తన నానమ్మతో దిగిన ఓ కూల్‌ ఫోటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు  చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇక ఈ అమ్మడి సినిమా విషయాలకు వస్తే.. ఈ ఏడాది తెలుగులో ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో భారీ విజయాన్ని అందకున్న పూజా ప్రస్తుతం ప్రభాస్‌, అఖిల్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox