Breaking News

కిమ్ కు కోపమొచ్చింది.. సంబంధాలన్నీ కట్..!

09 th Jun 2020, UTC

ఉత్తర కొరియా..దక్షిణ కొరియా దేశాలు చిరకాల శత్రువులుగా కొనసాగుతున్నాయి.. అయితే.. స్నేహ ఒప్పందాలు చేసుకున్నప్పటికీ వాటిని రద్దు చేసుకుంటున్నట్లు ఇటీవల కిమ్ నిర్ణయించుకున్నాడు.ఆయన ఆగ్రహానికి గురి అయి.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా..దక్షిణ కొరియా దేశాల మధ్య మళ్ళీ కోల్డ్ వార్ మొదలైంది. దక్షిణ కొరియాతో సైనిక, రాజకీయ పరమైన అన్ని సంబంధాలను తెంచుకుంటామని ఉత్తర కొరియా మంగళవారం ప్రకటించింది. తమ శత్రుదేశంతో ఇక ఎంతమాత్రం సంబంధాలు కొనసాగించబోమని ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది.
 
          హఠాత్తుగా... ఉత్తర కొరియా అధ్యక్షుడు ఈ విషయాన్నీ వెల్లడించడానికి కారణం ఏంటంటే.. దక్షిణ కొరియా లో కొందరు నిరసన కారులు... ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియా కు వలస వెళ్లిన వారు.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కు వ్యతిరేకం గా నినాదాలు చేస్తున్నారట. పైగా.. సరిహద్దు వద్ద కిమ్‌ నియంతృత్వ దోరణిని నిరసిస్తూ.. సరిహద్దుల్లో బెలూన్లు ఎగురవేశారట. కిమ్ వ్యతిరేకంగా...ఆయనను  దుయ్యబడుతూ కరపత్రాలు ముద్రించి బెలూన్లతో వదులుతున్నారట. ఈ తతంగమంతా చూసి కిమ్ కు చిర్రెత్తుకొచ్చింది. అయితే.. ఇందులో దక్షిణ కొరియా ప్రమేయమెంతవరకు ఉందొ తెలీదు గాని.. కిమ్ మాత్రం ఆ దేశం తో సంబంధాలన్నీ రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాడు. సరిహద్దు మీదుగా వస్తున్న గాలిబుడగల కరపత్రాలను నిలువరించడంలో దక్షిణ కొరియా ప్రభుత్వం విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్యాంగ్యాంగ్‌లోని అధికారులు తెలిపారు.
 
              అసలు ఈ బెలూన్ల వ్యవహారం ఈనాటిది కాదు. గత కొన్నేళ్లుగా దక్షిణ కొరియా సరిహద్దుల వద్ద బెలూన్లను ఎగుర వేస్తున్నారు. కాగా ఇప్పటికే ఓ సారి కిమ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. వీటిని గనుక నిలవరించకపోతే.. సరిహద్దుల్లో ఇరు దేశాలకు చెందిన కార్యాలయాలను పూర్తిగా మూసివేస్తామని గతంలోనే హెచ్చరించారు. అయితే.. ఈ వ్యవహారం పై నిషేధం ప్రకటిస్తామని దక్షిణ కొరియా ప్రకటించినా తిరిగి తిరిగి ఇదే రిపీట్ అవుతుండడం తో కిమ్ కు చిర్రెత్తుకొచ్చి సంబంధాలను కట్ చేసుకుంటున్నట్లు తెలిపారు. అయితే.. ఈ నిర్ణయం వెనుక.. కిమ్ సోదరి కిమ్‌ మో జోంగ్‌దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox