Breaking News

ప్రతి స్త్రీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలి... సీనియర్ నటి నీనా గుప్తా

07 th Jun 2020, UTC

ఇండియాలో 60 ఏళ్లు దాటినా మగవారు హీరో పాత్రలు చేస్తారు కాని మహిళలకు మాత్రం 35 ఏళ్లకే అవకాశాలు ముగిసిపోతాయని సీనియర్ నటి నీనా గుప్తా అంటున్నారు. ఆ వయసు దాటిన తరువాత అక్క, వదినతల్లి పాత్రలకే పరిమితమవుతారని అదే హాలీవుడ్ లో అయితే పరిస్దితి వేరుగా వుంటుందన్నారు. యాభై, అరవై ఏళ్లు దాటినవాళ్లు కూడా అక్కడ హీరోయిన్లుగా చేస్తుంటారని ఆమె చెప్పారు.
తాజాగా ఒక ఇంటర్వూలో  నీనా గుప్తా మాట్లాడుతూ –దాదాపు 30 ఏళ్లు నేను సినిమాలు చేశాను. కానీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా చేసిన ‘బదాయి హో’ (2018) తెచ్చిపెట్టినంత పాపులార్టీ నాకు అంతకు ముందు రాలేదు.

నేను అమితాబ్‌ బచ్చన్‌ని కాదని నాకు తెలుసు. మహిళలకు చాలా అరుదుగా పవర్‌ఫుల్‌ పాత్రలు రాస్తారు. నా వయసున్న  మగవాళ్లు హీరోలుగా చేస్తున్నారు. కానీ స్త్రీలు చేయకూడదు. నా వయసువారి కోసం పాత్రలు రాయడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది అన్నారు. అలాగే మహిళలకు ఓ సలహా ఇచ్చారు నీనా.

మహిళలకు ప్లాన్‌ బి ఉండాలి. ప్రతి స్త్రీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. ఆ విషయంలో ఎవరి మీదా ఆధారపడకూడదు. మన దగ్గర డబ్బుంటే ఎలాంటి సమస్యని అయినా పరిష్కరించుకోవచ్చు. అందుకే ప్రతి మహిళకు సొంత డబ్బు ఉండాలి. అదే ప్లాన్‌ బి అన్నారు నీనా గుప్తా.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox