Breaking News

అమ్మవారి పాత్రలో నయనతార..!

05 th Jun 2020, UTC
అమ్మవారి పాత్రలో నయనతార..!

లేడీ సూప‌ర్ స్టార్‌ న‌య‌న‌తార ఆర్జే బాలాజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ "ముఖ్తి అమ్మాన్‌" చిత్రంలో ఆదిశ‌క్తిగా క‌నిపించ‌నుంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుద‌ల చేసింది. ఇందులో పెద్ద పెద్ద ఆభ‌ర‌ణాలు ధ‌రించిన‌ న‌య‌న‌తార ఓ చేతిలో త్రిశూలం ప‌ట్టుకుని ఎరుపు, ఆకుప‌చ్చ చీరలో ప్ర‌కాశ‌వంతంగా మెరిసిపోతోంది. అమ్మ‌వారి అవ‌తార‌మెత్తిన న‌య‌న‌తార ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అమ్మ‌వారిగా న‌య‌న‌తార సరిగ్గా స‌రిపోయిందంటూ ఆమె అభిమానులు పేర్కొంటున్నారు  కాగా న‌య‌న‌తార ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో పాత్ర‌ల్లో న‌టించింది కానీ, అమ్మ‌వారిగా క‌నిపించ‌డం మాత్రం ఇదే తొలిసారి

ఈ సినిమా గురించి ద‌ర్శ‌కుడు ఆర్జే బాలాజీ మీడియాతో మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక‌ చిత్రమేన‌ని తెలిపారు. చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తూ పెరిగిన భ‌క్తి చిత్రాల్లో ఉన్న అంశాల‌న్నీ ఇందులోనూ ఉంటాయ‌ని పేర్కొన్నారు. ఈ సినిమా ఓటీటీలో విడుద‌ల చేయ‌మ‌ని, థియేట‌ర్‌లోనే చిత్రాన్ని చూడవలసి వుంటుందని బాలాజీ చెబుతున్నారు.

 సినిమాలో ఊర్వ‌శి, స్మృతి వెంక‌ట్‌, అజ ఘోష్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఇశారి కె గ‌ణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిరీశ్ సంగీతం స‌మ‌కూర్చారు. ఇదిలా వుండ‌గా న‌య‌న‌తార‌, స‌మంత హీరోహీరోయిన్లుగా, విజ‌య్ సేతుప‌తి హీరోగా త‌మిళంలో ‘కాదువాక్కుల రెండు కాదల్‌’ సినిమా తెర‌కెక్కనుంది. దీనికి న‌య‌న్ ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. కాగా న‌య‌న‌తార లాక్‌డౌన్‌కు ముందు ర‌జ‌నీకాంత్ "ద‌ర్బార్" చిత్రంలో చివ‌రిసారిగా క‌నిపించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox