Breaking News

యంగ్ టైగర్ ఫ్యాన్స్ పై మీరో చోప్రా ఫిర్యాదు..!

03 rd Jun 2020, UTC

అభిమానం వెర్రితలలు వేయడం అంటే ఏమిటో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు నిరూపిస్తున్నారు. తనకు ఎన్టీఆర్ కన్నా మహేష్ బాబు అంటే ఇష్టం అని ఒక హీరోయిన్ మాట్లాడినందుకు ఆమెపై దారుణంగా ట్రోలింగ్ కు దిగారు.
 `బంగారం  ఫేమ్ మీరా చోప్రా ఇటీవల ట్విటర్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా `తెలుగులో మీ అభిమాన హీరో ఎవర`ని ఆమెను ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన మీరా.. `మహేష్` పేరు చెప్పింది. అనంతరం `ఎన్టీయార్` గురించి ఓ అభిమాని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన మీరా.. `నేను ఎన్టీయార్ ఫ్యాన్‌ని కాదు. ఎన్టీయార్ కంటే మహేష్ అంటేనే నాకు ఎక్కువ ఇష్టం` అని పేర్కొంది. దీంతో ఎన్టీయార్ అభిమానులు మీరాపై తీవ్ర పదజాలంతో దూషణకు దిగారు. పచ్చిబూతులతో రెచ్చిపోయారు.దీంతో ఎన్టీయార్ అభిమానులపై మీరా ఫైర్ అవుతోంది. ఎన్టీయార్ కంటే మహేష్ అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పినందుకు ఇలా తిడతారా అంటూ ప్రశ్నిస్తోంది. ఎన్టీయార్‌ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. `తారక్.. మీ కంటే మహేష్ అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పినందుకు నన్ను `వేశ్య`, `పోర్న్‌స్టార్`, `తిరుగుబోతు` అని ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదు. మా పేరెంట్స్‌కు కూడా మీ అభిమానులు ఇలాంటి మెసేజ్‌లే పెడుతున్నారు. ఇలాంటి అభిమానగణంతో మీరు విజయవంతమైనట్టు భావిస్తున్నారా? మీరు నా ట్వీట్‌కు స్పందిస్తారని అనుకుంటున్నా` అంటూ

 మీరా ట్వీట్ చేసింది. ఎన్టీయార్ అభిమానులు పెడుతున్న ట్వీట్‌ల స్క్రీన్‌షాట్లను షేర్ చేస్తోంది. అలాగే   సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసింది. మీరాకు సింగర్ చిన్మయి, ఇతర నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox