Breaking News

పుట్టినరోజు రోడ్డు మీద చేసుకున్నాడు...పోలీసులు జైల్లో వేశారు.!

08 th Jun 2020, UTC

కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంటే... ఎవరు బయటకు రావొద్దని. వేడుకలు వంటి వాటికి దూరం గా ఉండమని చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే.. కొందరు తక్కువ మందితోనే తమ వేడుకలు పూర్తి చేస్తున్నా..మరికొందరైతే... ఎక్కువమందితో వేడుకలు జరుపుతున్నారు. దీనితో... వ్యాధి వ్యాప్తి మరింత గా పెరుగుతోంది. అసలు ఇంట్లోనే పుట్టిన రోజు వేడుకలు వంటివి వద్దని చెబుతుంటే.. ఒక వ్యక్తి ఏకంగా రోడ్డుపైనే జరుపుకున్నాడు.. తాను పుట్టిన రోజు జరుపుకుంటున్నట్లు అందరికి తెలియాలని బాణాసంచా ను కూడా కాల్చాడు.. అయితే.. ఇంతటితో ఆగకుండా...ఈ తతంగమంతా వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టాడు.. ఇంకా పోలీసులు ఆలస్యం చేయలేదు.. అతన్ని పట్టుకెళ్లి జైల్లో పడేసారు.
 
         వివరాల్లోకెళితే...దక్షిణ ముంబైలోని నాగ్‌పడాలో హమ్మద్ అన్సారీ(22) అనే వ్యక్తి తాలూకు ఉదంతమిది. తనకు తాను ఓ సామజిక కార్యకర్త గా చెప్పుకునే హమ్మద్.. సామాజిక స్పృహ లేకుండా నడ్డి రోడ్డుపై స్నేహితులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. తన బర్త్ డేను ఎంత ఘనంగా జరుపుకున్నానో చూడాలని ఎఫ్బీలో స్టేటస్ పెట్టాడు. శుక్రవారం-శనివారం మధ్య రాత్రిలో అన్సారీ మదాన్‌పురాలో తన పుట్టినరోజు జరుపుకున్నాడు.. భౌతిక దూరం అనేది అస్సలు పాటించకుండా వీధిలో టపాకాయలు కాలుస్తూ పుట్టినరోజు జరుపుకోవడం ఆ వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయింది. 
 
           ఈ విషయమై... పోలీసులు మాట్లాడుతూ.. కరోనా నిబంధనలకు వ్యతిరేకం గా అతను జన్మదిన వేడుకలు నడి రోడ్డుపై.సన్నిహితులతో.. భౌతిక దూరం పాటించకుండా జరుపుకున్నాడని...అంతటితో ఆగకుండా అర్ధరాత్రి చెవులు చిల్లులు పడే శబ్దం తో బాణాసంచా కాల్చాడని పోలీసులు తెలిపారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox